కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద మందుగా కుప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని కుప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది.
ఈ మొక్క ఆకుల రసాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులను మెత్తగా చేసి అందులో కొద్దిగా పసుపును కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. కుప్పింటాకు చెట్టు ఆకుల నుండి రసాన్ని తీసుకుని అందులో నిమ్మరసాన్ని కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల గజ్జి, తామర వంటి వాటితో పాటు దురదలు, దదుర్లు తగ్గుతాయి.