చేమంతి పువ్వులలోని ఔషధ గుణాలు అనేక రకాలైన గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి, రెండు స్పూన్ల చేమంతి రేకులను వేసి మూతపెట్టి దించేయాలి. 5 నిమిషాల తరువాత వడబోసి త్రాగాలి. ఇందులో రుచికోసం కాస్తంత తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. ఇవేమీ వేయకుండానే కూడా నచ్చితే తీసుకోవచ్చు.
ఇలా రోజుకు రెండు కప్పుల చొప్పున చేమంతి ద్రావణాన్ని తీసుకున్నట్లయితే... మెన్సెస్ సమయంలో కండరాలు పట్టేసి, పెద్దగా నొప్పి వస్తుండే సమస్యను నివారిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే బహిష్టు సమస్యల నుంచి బయటపడువచ్చు.
ఏడాది పొడవునా తాజా చామంతి పువ్వులు దొరకడం కష్టం కాబట్టి, అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి, నిల్వచేసుకుని వాడుకోవడం మంచిది. అలాగే.. బహిష్టు సమయంలో కడుపునొప్పి బాధిస్తున్నట్లయితే, కింద పొట్టమీద, నడుము మీద వేడి కాపడం పెట్టుకోవాలి. చిన్న టవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు. లేదా మార్కెట్లో దొరికే హాట్ ప్యాక్ బ్యాగ్‌ను అయినా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి కొద్ది కొద్దిగా బయటపడవచ్చు.