ముల్లంగి ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. తరచు ముల్లంగి జ్యూస్ సేవిస్తూ ఉంటే కాలేయ సంబంధ వ్యాధులు నయమవుతాయి. ముల్లంగిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టుకుని మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజుకు ఓ చెంచా చొప్పున తీసుకుంటే శరీరంలోని ఏ అవవయం లోనైనా వాపూ, నొప్పి ఉంటే తగ్గిపోతాయి.
ఆగకుండా వెక్కిళ్ళు వస్తున్నప్పుడు కాస్తంత ముల్లంగి రసం తాగితే వెంటనే తగ్గిపోతాయి. పచ్చి ముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తరచు తాగుతూ వుండే సాఫీగా విరేచనమవుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. అలానే లివల్ వ్యాధితో బాధపడేవారు తరచు ముల్లంగి తింటే సరిపోతుంది. ముత్రాపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి తోడ్పడుతుంది.
ముల్లంగి విత్తులను బాగా ఎండ బెట్టుకుని మెత్తగా దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో రోజూ కలిపి తింటుంటే స్త్రీలలో వచ్చే రుతు సంబంధ వ్యాధులు నయమవుతాయి. విపరీతమైన దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారు ముల్లంగి రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ముల్లంగి రసానికి నాలుగో వంతు నువ్వుల నూనె కలిపి నూనె మాత్రమే మిగిలేలా కాచి భద్ర పరచుకోవాలి.
ఈ నూనెను వడగట్టి.. చెవిపోటు, చెవిలో హోరు బాధితుల చెవిలో కొన్ని చుక్కులు వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్లవాపులు, నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేస్తే ఆ సమస్యనుండి ఉపశమనం లభిస్తుంది.