తెల్ల మిరియాలను పొడి చేసుకొని ఒక చెంచా పొడిని గ్లాస్ నీళ్ళలో కలుపుకుని రోజూ త్రాగితే గుండె జబ్బులు రావు. మల్లెపూలతో చేసిన టీ రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రోజూ కాసిన్ని ఎండు ద్రాక్ష తింటే గుండె బలంగా ఉంటుంది.
లేత చింతచిగురు, గుండెకు చాలా మంచిది. దానిని కూరలలో వేసుకొని కానీ పొడి చేసుకొని కానీ తినవచ్చు. చిటికెడు కుంకుమపువ్వును కొంచెం నిమ్మరసంలో కలిపి పుచ్చుకుంటే గుండె బలంగా ఉంటుంది. దానిమ్మ గింజలు, దానిమ్మ ఆకుల రసం అన్ని రకాల గుండె జబ్బులను నివారిస్తుంది.