బొప్పాయి ఆకుల రసాన్ని ఇలా చేస్తే..?

మంగళవారం, 27 నవంబరు 2018 (09:59 IST)
ఈ కాలంలో బొప్పాయి పండ్లు చాలా విరివిగా దొరుకుతాయి. ఇటీవలే ఓ పరిశోధనలో.. ఈ పండును తరచుగా తీసుకునే వారికి మానసిక ఆందోళన తొలగిపోతుందని తేలింది. బొప్పాయి ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే నచ్చని వారికి కూడా ఇది తినాలనిపిస్తుంది. మరి అవేంటో పరిశీలిద్దాం.
 
1. సీజన్ వేరియేషన్ వలన వచ్చే వ్యాధుల కారణంగా పలురకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు. ఈ సమస్యలు నుండి విముక్తి చెందాలంటే.. బొప్పాయి తీసుకోవాల్సిందేనని పరిశోధనలో తెలియజేశారు. 
 
2. బొప్పాయి పేస్ట్‌గా అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి సేవిస్తే దగ్గు, జలుబు వంటి సమస్యలు రావు. బొప్పాయి తొక్కలను బాగా ఎండబెట్టుకుని పొడి చేసి గ్లాస్ పాలలో కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే ఫలితం ఉంటుంది. 
 
3. బొప్పాయిలోని పొటాషియం మానసికశక్తిని పెంచుటకు సహాయపడుతుందని అధ్యయనంలో వెల్లడైంది. రక్తప్రసరణలోని లోపాలను నివారించుటకు చాలా ఉపయోగపడుతుంది. 
 
4. బొప్పాయిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాదు, దీనిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో పాటు కంటి చూపు కూడా బాగుంటుంది. 
 
5. బరువు తగ్గాలనుకునే వారు రోజూ బొప్పాయి జ్యూస్ సేవిస్తే మంచిది. శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషక విలువలను కూడా అందిస్తుంది. 
 
6. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చెవిలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించాలంటే.. బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
7. రోజంతా పనిచేసి అలసిన వారు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా బొప్పాయి పండును తీసుకుంటే శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. తద్వారా అలసట, ఒత్తిడి తొలగిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు