లవంగం తులసి ఆకుల రసం పురుషుల్లో వీర్యవృద్ధికి?

శుక్రవారం, 29 మార్చి 2019 (18:03 IST)
లవంగ తులసి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మొక్కను ఆహారపానీయాలలో లేదా ఔషధంగా ఉపయోగించడం మనం చూసుంటాం. ఈ మొక్కలోని ప్రతి భాగంలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క నుంచి సుగంధాలు వెదజల్లుతాయి. దీనికి కారణం ఇందులో యూజెనాల్‌, మిథైల్‌ యూజెనాల్‌, కారియోఫిల్లీన్‌, సిట్రాల్‌, కేంఫర్‌, థైమాల్‌ వంటి ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ ఉండటం. 
 
ఇలాంటి సుగంధ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి. లవంగ తులసి మొక్కలను పెంచే చోట పరిసరాలు పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంటాయి. దోమలు అక్కడికి రావు. ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాలను చూద్దాం. లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
జీర్ణశక్తిని పెంపొందించడానికి, శరీరానికి సత్తువ అందించడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల సమస్యలను ఇట్టే నయం చేస్తుంది, రక్తస్రావాలను నిరోధించుటకు ఉపకరిస్తుంది. తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటుతో బాధపడేవారు ఇది తింటే ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు కావు. 
 
దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యల నివారణకు పనిచేస్తుంది. తులసి ఆకుల రసం పురుషుల్లో వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూసుకుంటుంది. దోమలను పారద్రోలే శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. డయాబెటిస్ మందులు వాడే వారు ఇది తీసుకుంటే బాగా పనిచేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు