కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి మంటను కొత్తిమీర తగ్గిస్తుంది. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను కొత్తిమీర దూరం చేస్తుంది. ఉసిరికాయ, కొత్తిమీర జ్యూస్‌ను తీసుకుని.. అరగ్లాసుడు తీసుకుని అందులో తేనె కలుపుకుని తాగితే కంటి మంట తగ్గిపోతుంది. ఈ మిశ్రమం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కొత్తిమీరలో పీచు శాతం ఎక్కువ. కొత్తిమీర రసాన్ని రోజూ అరగ్లాసుడు తీసుకుంటే నోటిపూత, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలుండవు. కొత్తిమీర రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి ఉపయోగపడుతుంది.