సువాసన ద్రవ్యంగా కొత్తిమీరి ఆకులను వాడుతారన్నది తెలిసిందే. ఈ కొత్తిమీరి ఆకు 25 గ్రాములు తీసుకుని దానిలో 100 గ్రాములు నీళ్లు పోసి 25 గ్రాముల కషాయం మిగిలేట్లు కాచి దించి వడబోసిన ద్రవాన్ని పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ కషాయంలో కొద్దిగా బెల్లం, కొంచెం అల్లం రసం కలిపి తాగితే గొంతు నొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు తగ్గుతాయి.