భోజనం చేసిన వెంటనే సోంపు గింజల్ని ఎందుకు తింటారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. అజీర్తికి సోంపు చెక్ పెడుతుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకే భోజనం తర్వాత సోంపు గింజలను నమలాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అజీర్ణంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. రోజుకు ఒక టీ స్పూన్ సోంపు గింజలను తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
భోజనం చేసిన వెంటనే సోంపు గింజలను తినడం ద్వారా నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములు నశించడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.