అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

దేవీ

శుక్రవారం, 18 జులై 2025 (16:38 IST)
Anand, madhura, vyshavi
కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయన్ వైష్ణవి చైతన్య చేతుల మీదుగా జరిగింది. పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన వైద్య చికిత్సను సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ అందిస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ డా.శ్రీ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఎండీ సంధ్య బి.రెడ్డి, వారి కూతురు అక్షత, తదితరులు పాల్గొన్నారు.
 
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ జుబ్లీహిల్స్ లో మేమే ప్రారంభించాం. ఇప్పుడు కొంపల్లిలో ఆస్పత్రి అందుబాటులోకి తీసుకొస్తున్నాం మీరు రావాలి అని డా.శ్రీ రెడ్డి గారు అడిగినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. మీరు ఫ్యూచర్ లో పెట్టే బ్రాంచెస్ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మనకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటాం కానీ పెట్స్ వాటి బాధను, అనారోగ్య సమస్యను చెప్పుకోలేవు.  రెండేళ్ల క్రితం మా ఇంట్లో పెట్ కు హెల్త్ బాగా లేకుంటే అమ్మా, నాన్న చాలా బాధపడ్డారు. అప్పడు డా.శ్రీ రెడ్డి గారు సెవెన్ ఓక్స్ డాక్టర్స్ చికిత్స అందించారు. మా ఇంట్లో పెట్స్ ను చాలా కేరింగ్ గా చూసుకుంటాం. అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి. విదేశాలకు వెళ్లినా, అవి ఎలా ఉన్నాయో ఎప్పుడు కనుక్కుంటాం. నాన్నకు పెట్స్ చాలా ఇష్టం. పెట్స్ కు సెవెన్ ఓక్స్ హాస్పిటల్ లో మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించడం సంతోషంగా ఉంది. సికింద్రాబాద్ సైడ్ నుంచి తమ పెట్స్ ను జుబ్లీహిల్స్ దాకా తీసుకురావడం కష్టం. కొంపల్లిలో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ద్వారా పెట్స్ ఉన్న వారందరికీ చాలా హెల్ప్ అవుతుంది. మీ పెట్స్ కు మంచి చికిత్స కోసం సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ను సంప్రదించండి. సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ - నేను పెట్ లవర్ ను. మా ఇంట్లో ఆల్ఫా అనే డాగ్ ఉంది. అది మా ఇంటికి వచ్చాక ఇంట్లో పిల్లాడిలా మారిపోయింది. దాన్ని ఎలా బాగా చూసుకోవాలి అనేది ఎప్పుడూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆలోచిస్తుంటాం. అలాంటి క్రమంలో మాకు సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ గురించి తెలిసింది. ఆల్ఫాకు బాగాలేనప్పుడు సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ జుబ్లీహిల్స్ బ్రాంచిలో చూపించాం. తను చాలా హెల్దీగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు కొంపల్లి, చుట్టుపక్కల ఉన్నవారంతా జుబ్లీహిల్స్ దాకా వెళ్లకుండా మీ టైమ్ చాలా సేవ్ అయ్యేలా ఇక్కడే బ్రాంచి ఓపెన్ చేశారు. మీరంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు.
 
డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - నాకు పెట్స్ అంటే భయం ఉండేది. కానీ నాకు దగ్గరైన మిత్రులంతా పెట్ లవర్స్. వాళ్ల స్నేహంతో నాకు కూడా పెట్స్ దగ్గరయ్యాయి. అలా నాకు ఆనంద్ దేవరకొండ పెట్ దగ్గరైంది. ఆ తర్వాత నేను పెట్ పేరెంట్ అయ్యాను. మన పెట్ కు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎంతో బాధపడతాం. మంచి వైద్యం అందించాలని ఎక్కడ మంచి ఆస్పత్రి ఉందో వెతుకుతుంటాం. సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ గురించి తెలిశాక పెట్ పేరెంట్ గా నా పెట్స్ గురించి ఉన్న భయం తగ్గిపోయింది. డా. శ్రీ రెడ్డి, డా. సంధ్య గారు మాకు రిలేటివ్స్. ఈ రోజు కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ఇద్దరు పెట్ లవర్స్ అయిన ఆనంద్, వైష్ణవి చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉంది. అన్నారు.
 
డా. శ్రీ రెడ్డి మాట్లాడుతూ - సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు థ్యాంక్స్. మేము విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా జుబ్లీహిల్స్ బ్రాంచ్ ప్రారంభించాం. అప్పటినుంచి వారితో మంచి రిలేషన్ ఏర్పడింది. జుబ్లీహిల్స్ బ్రాంచ్ కు ఎక్కువగా కొంపల్లి సైడ్ నుంచే పెట్స్ ను చికిత్స కోసం తీసుకొస్తున్నారు. అందుకే ఇక్కడే ఒక హాస్పిటల్ ఏర్పాటుచేశాం. సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ లో పెంపుడు జంతువులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నాం. హ్యూమన్ హాస్పిటల్స్ లాగే వివిధ విభాగాలు ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ టైమ్ పెట్స్ కు ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. లండన్, యూఎస్, సింగపూర్ నుంచి వైద్యుల ఇంటరాక్షన్ సెషన్స్ పెడుతున్నాం. పెట్స్ ను ఆస్పత్రిలోకి తీసుకొచ్చేప్పుడు వాటిని కంఫర్ట్ గా తీసుకొచ్చేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. మా దగ్గర పనిచేసే వైద్యులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. నగరంలో మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి పెట్స్ కు సమగ్రమైన చికిత్స అందించాలనే లక్ష్యంతోనే మా హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. అన్నారు.
 
డా.సంధ్య బి. రెడ్డి మాట్లాడుతూ - మా సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. పెట్స్ కు మల్టీస్పెషాలిటీ వైద్య సేవలను మా ఆస్పత్రిలో అందిస్తున్నాం. హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా స్తోమత లేని వారి పెంపుడు జంతువులకు సరైన వైద్యం అందిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ లో ఏ ఛారిటీ ఫౌండేషన్ వారు తమ సంస్థ తరుపున పెట్స్ ను చికిత్సకు తీసుకువచ్చినా మా ఆస్పత్రిలో 50 పర్సెంట్ రాయితీ ఇస్తున్నాం. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు