కరోనా కాలంలో అల్లంను తప్పకుండా వాడటం మంచిది. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. అల్లం రసం సేవిస్తే దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం రసాన్ని రోజూ సేవిస్తుంటే కొన్ని రోజులకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరే ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలో అల్లం మెరుగ్గా పనిచేస్తుంది. నిత్యం అల్లం రసం సేవించడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.