గోంగూర పువ్వులతో ఇన్ఫెక్షన్లకు చెక్

శుక్రవారం, 10 నవంబరు 2017 (15:33 IST)
శరీరంలో నీటి శాతం తగ్గడం.. మలినాలు శరీరంలోనే నిలిచిపోవడం.. ద్వారా ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటివి ఏర్పడుతున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. యూరినల్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సంబంధిత రుగ్మతలకు చెక్ పెట్టాలంటే.. తంగేడు పువ్వులను, గోంగూరను ఔషధంగా తీసుకోవాలి. ప్రస్తుతం గోంగూర పువ్వులను ఉపయోగించి యూరినల్ ఇన్ఫెక్షన్లను ఎలా దూరం చేసుకోవాలో చూద్దాం.. 
 
గోంగూర పువ్వులు ఐదు, సోంపు అర స్పూన్, పటిక బెల్లం అర స్పూన్ చేర్చి ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున తాగితే యూరినల్ ఇన్ఫెక్షన్లు వుండవు. గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో తెల్లబట్టను తొలగిస్తుంది. సోంపు శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అలాగే తంగేడు పువ్వులు, పటిక బెల్లాన్ని చెరో రెండు స్పూన్లు తీసుకుని రెండు గ్లాసుల నీటిలో మరిగించి తీసుకుంటే.. కిడ్నీ సంబంధిత రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. తంగేడు పువ్వులను ప్రతి రోజు ఉదయం గ్లాసుడు నీటిలో వేసి మరిగించి తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. 
 
నోటిపూత, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. త్రిఫల చూర్ణం పావు స్పూన్ తీసుకుని ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే నోటి పూత నయం అవుతుంది. కరక్కాయ, ఉసిరి కాయ, తానికాయనే త్రిఫలాలు అంటారు. ఈ పొడిని అర స్పూన్ మోతాదులో రెండు రోజులకు ఓసారి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు