శొంఠిని సలసలా మరిగే నీళ్లలో కలిపి స్నానం చేస్తే?

సోమవారం, 20 ఆగస్టు 2018 (13:12 IST)
శొంఠిని అరగదీసిన గంధాన్ని కణతలకు రాసుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శొంఠి పొడిని బియ్యపు పిండిలో కలుపుకుని నుదిటి మీద పట్టీలా వేసుకుంటే కూడా తలనొప్పి నుండి విముక్తి చెందవచ్చును. శొంఠిని వేడినీళ్ళల్లో సలసల మరిగించుకుని ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
 
శొంఠి ముక్కను నమిలి బుగ్గన పెట్టుకుంటే పంటి నొప్పులు, చిగురు నొప్పులు తగ్గుతాయి. అరలీటరు మంచినీళ్ళలో పది గ్రాముల శొంఠిని వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి ప్రతిరోజూ తీసుకోవడం వలన పొడిదగ్గు, విరేచనాలు వంటి సమస్యలు తొలగిపోతాయి. 
 
శొంఠి, జీలకర్ర, కొత్తిమీరను సమభాగాలుగా తీసుకుని నీళ్ళలో వేసి మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడబోసి చల్లార్చి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 10 గ్రాముల శొంఠిని అరగదీసి పులిసిన మజ్జిగలో కలుపుకుని ప్రతిరోజూ మూడు పూటలా తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు