నిమ్మరసంలో తేనెను కలుపుకుని తీసుకుంటే?

సోమవారం, 20 ఆగస్టు 2018 (10:12 IST)
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి, బి6, ఎ, ఇ, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్, మెగ్నిషియం, పొటాషియం, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటు, జ్వరం, జీర్ణశక్తి వంటి సమస్యలను తగ్గించుటలో నిమ్మరసం చక్కగా సహాయపడుతుంది.
 
నిమ్మరసం నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఈ నిమ్మరసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ నిమ్మరసాన్ని వారానికి రెండుసార్లు రాసుకుంటే వెంట్రుకలు నల్లగా మారుతాయి. నిమ్మరసం సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఈ నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం ముడతలు కూడా తొలగిపోతాయి. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. కాలిన గాయాలకు లేదా మచ్చలపై నిమ్మరసాన్ని రాసుకుంటే మచ్చలు పోతాయి. ఈ నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది. కలరా, మలోరియా వంటి జబ్బులు కూడా తొలగిపోతాయి. గొంతు ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు