శెనగల్లో చలువచేసే గుణాలున్నాయి. ఇవి రక్త దోషాలను పోగొట్టి బలాన్ని కలిగిస్తాయి. శెనగలు సులభంగా జీర్ణమవుతాయి. శెనగాకు ఆహారంగా వాడితే పిత్త వ్యాధులు నశిస్తాయి. అలాగే చిగుళ్ల వాపును తగ్గిస్తాయి. గజ్జి, చిడుము, తామర కలవారు ప్రతిరోజూ శెనగపిండితో రాసుకుని స్నానం చేస్తే ఆ వ్యాధులు మటుమాయమవడమే కాకుండా దేహానికి, ముఖానికి కాంతి వస్తుంది.