ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువగా నీరు సేవించాలి. నీరు తీసుకోవడం వలన తాజాగా తయారవ్వడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పండ్లు, ఆకుకూరలతోపాటు నీరు సేవిస్తే చాలని వైద్యులు తెలిపారు. ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్స్ అవసరమౌతాయి. మరి చర్మసౌందర్యాన్ని పెంచే ఆ విటమిన్స్ ఏవో చూద్దాం..
విటమిన్ ఏ: బొప్పాయి, కోడిగుడ్డు
విటమిన్ బి: పండ్లతోపాటు ఆకుకూరల్లోను పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ సి: నారింజ, నిమ్మకాయ, చీనీపండు.
విటమిన్ ఇ: వేరుశెనగ, ఇతర నూనె గింజల్లో లభిస్తుంది.