1. పెద్ద ఉసిరికాయను బాగా దంచి, గింజలను తీసేసి ఆ మిశ్రమాన్ని నేతిలో వేయించి.. కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు మందంగా పట్టువేసి ఆరనివ్వాలి. ఇలా చేయడం వలన ముక్కు నుండి రక్తస్రావం ఆగిపోతుంది.
3. ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష.. ఈ రెండింటిని మెత్తగా నూరి తగినంత తేనె కలిపి ఓ సీసాలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో చెంచా చొప్పున తీసుకుంటే అన్ని రకాల రక్తస్రావాలు అరికడుతాయి.
4. అడ్డసరం చెట్టు ఆకులు, వేళ్ళు, పువ్వులు.. వీటిని రసంగా తీసి పెట్టుకోవాలి. నోట్లో నుంచి, ముక్కులో నుంచి రక్తస్రావం అవుతుంటే.. ఈ రసాన్ని తీసుకుంటే.. అరికడుతుంది.
5. క్షయ, ఊపిరతిత్తుల వ్యాధితో బాధపడేవారు అడ్డసరం ఆకుల రసంలో నెయ్యి కలిపి బాగా వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమాం చల్లారిన తరువాత రోజుకు రెండు పూటలా చెంచా చొప్పున తీసుకుంటే ముక్కులో నుండి, నోట్లో నుండి వచ్చే రక్తస్రావాలు నివారిస్తుంది.