నోటి దుర్వాసన పోవాలంటే.. ఏం చేయాలి..?

మంగళవారం, 18 డిశెంబరు 2018 (12:23 IST)
చాలామందికి నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ఏం.. మాట్లాడినా లేదా నోరు తెరచిన దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఈ సమస్య నుండి విముక్తి చెందాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం...
 
నోటి నుంచి దుర్వాసన రావడానికి పాలు కూడా ఒక కారణమే అంటున్నారు వైద్య నిపుణులు. పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీటితో పాటు ఇందులో బ్యాక్టీరియా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఎక్కువ మందికి పడవు. ఇవి పొట్టలో సల్ఫర్ కాంపౌడ్స్‌ని విడుదల చేస్తాయి. ఇవి దుర్వాసనకు కారణమవుతాయి.
 
కొందరు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్లు ఎన్నిసార్లు బ్రష్ చేసినా నోటి దుర్వాస తగ్గదు. అలాంటి వారు తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నోటి దుర్వాసన సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. వారు ముఖ్యంగా వెల్లుల్లిని దూరంగా ఉంచాలి. ఇందులో ఉన్న సల్ఫర్ కారణంగా నోటి నుంచి, శరీరం నుంచి దుర్వాస వస్తుంది. 
 
కనుక నోటి దుర్వాసన సమస్య ఉన్న వారు వీటి జోలికి వెళ్లకపోవడమే మేలు. అన్నింటి కంటే ముఖ్యంగా రోడ్డు సైడ్‌లో లభించే కబాబ్స్, జంక్ ఫుడ్‌‌ల జోలికి వెళ్లకండి. వీటిని ఎక్కువ మొత్తం తీసుకున్నా నోటి దుర్వాస ఎక్కువగా ఏర్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు