తేనె, కొన్ని చుక్కల లవంగం నూనెను గోరువెచ్చటి నీటిలో కలిపి రోజులో మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను వాసనచూస్తుంటే సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం ద్వారా ఒత్తిడి, అలసట, ఆయాసం తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో లవంగం చక్కగా పనిచేస్తుంది.
లవంగాలలో ఉండే యూజెనాల్ అనే రసాయన పదార్థం నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది. లవంగాలు వీర్య కణాల వృద్ధికి కూడా తోడ్పాటునందిస్తాయి. తులసి, పుదీనా, లవంగాలు, యాలకల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ టీలో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఆస్తమా, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో కూడా యాలకులు, లవంగాలు బాగా పనిచేస్తాయి. రెండుమూడు యాలకులు, లవంగాలు, ఓ అల్లం ముక్కను కాసిన్న దనియాలతో కలిపి పోడి చేసి పెట్టుకోవాలి. రోజూ గ్లాస్ వేడినీటిలో వేసుకుని తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.