తేనె, తెల్లసొనను జుట్టుకు పట్టిస్తే..?

శనివారం, 7 అక్టోబరు 2017 (12:14 IST)
బాదం నూనెను ఒక చిన్న గిన్నెలో తీసుకుని కొంచెం వేడి చేసి తలకు పట్టించాలి. అరగంట తరువాత సాధారణ షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, బలంగా తయారవుతుంది. ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెను తీసుకుని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్‌ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరుచుకోవాలి. 
 
అలాగే అరకప్పు తేనెలో ఒక టేబుల్‌స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక కోడిగుడ్డు పచ్చసొనను చేర్చి జుట్టుకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తడిజుట్టును ఎప్పుడూ దువ్వకూడదు. పొడిగా ఉన్న జుట్టుతో పోల్చితే తడి జుట్టు మూడు రెట్లు బలహీనంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. వీలైనంత వరకు నీళ్లు ఎక్కువ తాగాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య వుండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు