బానపొట్ట కరగిపోయేందుకు ఉత్తరేణి రసం

శనివారం, 19 జూన్ 2021 (22:30 IST)
ఉత్తరేణి దంతచిగుళ్ల సమస్యకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 100 గ్రాముల ఉత్తరేణి గింజలపొడి, 10 గ్రాముల పొంగించినపటిక(శుభ్రభస్మ), 10 గ్రాముల ఉప్పు, 1-2 ఉంటకర్పూరంబిళ్లలు కలిపి మెత్తగా నూరి సీసాలో నిల్వ వుంచుకుని దంతధావనచూర్ణంగా ఉపయోగిస్తుంటే పంటినొప్పులు, పిప్పిపన్ను, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్లవాపు, చీము కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
 
బానపొట్ట తగ్గేందుకు... 250 గ్రాముల ఉత్తరేణి రసాన్ని 250 మి.లీ నువ్వుల నూనెలో కలిపి సన్నని మంటపై పైన రసం అంతా ఇగిరి నూనె మాత్రం మిగిలేట్లు మరిగించి దించి చల్లార్చి వడకట్టి నిల్వ వుంచుకుని రోజుకి ఒకసారి తగినంత నూనెను పొట్టభాగంపై మర్దన చేసి వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి కాపడం పెడుతుంటే కడుపులో అధికంగా సంచితమైన కొవ్వు కరిగి నాజూకుగా అవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు