ఫేషియల్ తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలి.. అరటి పండు ఫేషియల్ ఎలా?

గురువారం, 13 అక్టోబరు 2016 (18:17 IST)
చర్మానికి నిగారింపు చేకూరాలంటే ఫేషియల్ చేసుకోవాలి. నెలకోసారైనా ఫేషియల్ చేసుకోవాలి. అయితే ఫేషియల్‌కు తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేషియల్‌ తరువాత చర్మానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. ఫేషియల్‌ తరువాత వెంటనే మేకప్‌ వేయకూడదు. ఫేషియల్‌ తరువాత చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం ఆక్సిజన్‌ను బాగా గ్రహిస్తుంది. కాబట్టి వెంటనే మేకప్‌ చేసుకోకూడదు. 
 
ఫేషియల్ తర్వాత గ్రీన్‌ టీ లేక గోరు వెచ్చని నిమ్మరసం, తేనె తీసుకోవాలి. వీటివల్ల చర్మంపై ఉన్న ప్రెషర్‌ పాయింట్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. దీనివల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. డిటాక్సిఫికేషన్‌ జరిగి శరీరానికి రిలాక్స్‌ దొరుకుతుంది. వేడి నీళ్లతో లేక చల్లటి నీళ్లతో స్నానం చేయకూడదు. ఫేషియల్‌ తరువాత గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి.  
 
వారానికోసారి అరటిపండుని గుజ్జులా చేసి శనగపిండి వేసి ఫేస్ పై బాగా మసాజ్ చేయాలి. దానివల్ల చర్మం చాలా కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల వచ్చే నల్లని మచ్చలు పోతాయి. అరటిపండు గుజ్జు రాసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగడం వల్ల ముఖానికి ఉన్న జిడ్డు తొలగిపోతుంది. చల్లని నీటితో కడగడం వల్ల ప్రయోజనం ఉండదని బ్యూటీషన్లు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి