జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి6లు సమృద్ధిగా ఉంటాయి.
ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి.