కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి?

సోమవారం, 29 మే 2017 (15:49 IST)
ఎండాకాలంలో మజ్జిగ, కరివేపాకు పొడి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. కరివేపాకు, జీలకర్ర పొడి పాలల్లో కలిపి తీసుకొంటే అజీర్తి సమస్య దూరమవుతుంది. అలాగే కరివేపాకు రోజు పదేసి ఉదయం పూట పరగడుపున నమిలితే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే డయాబెటిక్ సమస్య అదుపులో ఉంటుంది. కరివేపాకును గుజ్జుగా చేసి లేదా జ్యూస్‌గా తాగినా బరువు తగ్గుతారు. డయేరియా సమస్య వుండదు. 
 
గాయాలకు కరివేపాకు గుజ్జును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి. గర్భిణీ మహిళల వికార సమస్య తగ్గాలంటే.. తేనె, స్పూన్ నిమ్మరసంలో కరివేపాకు పొడిని తీసుకోవాలి. ఎండిన కరివేపాకు పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేసి, ఆ తర్వాత తలంటు పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు బాగా పెరగటమే కాకుండా, నల్లగా అవుతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి