ఎండిన ఖర్జూరాలు కాదు.. నానబెట్టిన ఖర్జూరాలు తీసుకుంటే?

వరుణ్

ఆదివారం, 4 ఆగస్టు 2024 (20:57 IST)
ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా వుండవచ్చు. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక అలసటను తొలగిస్తుంది. అవసరమైన శక్తిని అందిస్తుంది. 
 
నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల ఈ ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. నానబెట్టిన ఖర్జూరం తేలికగా జీర్ణమవుతుంది. నానబెట్టిన ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించడానికి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకోవాలి. 
 
నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వ్యాధుల నుంచి కాపాడుతుంది. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే నానబెట్టిన ఖర్జూరాలు తినాలి. ఖర్జూరాలలో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు