హైదరాబాద్ నగరంలో పదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. కూకట్‌పల్లి సంగీత్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. అయితే, ఆ బాలిక ఎదురు తిరిగింది. దీంతో జీర్ణించుకోలేని ఆ యువకుడు ఆమెను కత్తితో పొడవడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల కథనం మేరకు.. సంగీత్ నగర్‌లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్ మెకానిక్.. తల్లి ల్యాబ్ టెక్నీషియన్. బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌కు పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
కూకట్‌పల్లి పోలీసులతో పాటు బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.