ఒత్తిడిలో ఉన్నప్పుడు 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.!

బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (17:27 IST)
ఉల్లాసంతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అంతకన్నా ముందు ఒత్తిడి సంకేతాలు గుర్తించండి. ఎలాంటి సమయంలో బాగా ఒత్తిడిగా ఉంటుందనేది తెలుసుకోండి. ఆ వివరాలను ఓ పుస్తకంలో రాసుకోండి. భవిష్యత్తులో జాగ్రత్త పడండి. 
 
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎప్పటిలానే పనులు చేసుకుపోకండి. కనీసం పది నిమిషాలైనా విశ్రాంతి తీసుకోండి. రోజువారీ దినచర్యలో విశ్రాంతి కంటూ సమయం కేటాయించండి. ఇలా చేస్తే శరీరానికి, మనస్సుకు విశ్రాంతి లభించినట్లవుతుంది. 
 
రోజువారీ పనులను సమయం ప్రకారం, ప్రణాళిక ప్రకారం చేసుకుపోండి. అలాగే మీ వల్ల కాదనుకునే పనులను స్వీకరించకండి. తద్వారా భారాన్ని తగ్గించుకోండి. పనిభారం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు సహోద్యోగులు, కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి. 
 
దినచర్య ఎంత బిజీగా సాగుతున్నప్పటికీ మీ జీవితంలో సరదాలూ ఉండేలా చూసుకోండి. పిల్లలతో కలిసి ఆడుకోవడం, ఎప్పుడయినా పిక్నిక్ లాంటి వాటికి వెళ్లడం, రోజూ కాసేపు నచ్చిన పనులు చేయడం లాంటివి ముఖ్యమే. సాధ్యమైనంతవరకు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆహారంలో మార్పులు చేసుకుని పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిన్నంటితోపాటు కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. 

వెబ్దునియా పై చదవండి