ఇక వారానికి ఓ రోజు చేపలు తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలను తీసుకోవడం ద్వారా ఒత్తిడి నుండి గుండెను పదిలం చేసుకోవచ్చు. తద్వారా గుండెపోటు లాంటి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చును. అలాగే రెండు రోజులకు ఒకసారి.. తోటకూర తీసుకోవాలి. తోటకూరలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.