హరిహరవీరమల్లు సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. ఔరంగ్ జేబ్ కథ చెబితే చాలామంది కోపాలు వచ్చాయి. ఎందుకు వస్తాయి. టోపీలు కుట్టి జీవనం సాగించాడని పుస్తకాలలో చదివాను. కానీ ఎంతోమందిని రాజులను చంపారు. హిందూవులను హింసించారు. అవి చెప్పడం తప్పా? అంటూ విమర్శకులపై ప్రశ్నలు సంధించారు. నెగెటివ్ గా మాట్లాడేవారిని ప్రతివారూ తిప్పికొట్టాలి.
పంచాయితీరాజ్ మంత్రిగా సినిమా పంచాయితీ చేస్తాననుకోలేదు
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈరోజు కేబినెట్ మీటింగ్ వుండడం వల్ల సక్సెస్ మీట్ కు కొద్దిగా ఆలస్యంగా వచ్చాను. మీడియాకు క్షమాపణలు కోరుకుంటున్నా. నాకు సక్సెస్ మీట్ లు పెద్దగా అలవాటు లేదు. పొద్దున మీటింగ్ లో పంచాయితీ రాజ్ శాఖలో పలు విషయాలు చర్చించాం. అక్కడ పంచాయితీలే అనుకున్నాను. కానీ సినిమా పంచాయితీలు కూడా తీర్చాలని నేను అనుకోలేదు. నాకు ఏది కూడా వడ్డించిన విస్తరి కాదు. నేను ఉపముఖ్యమంత్రి కదా సినిమా ఈజీగా రిలీజ్ అవ్వాలి. కానీ అవ్వదు. నేనూ పంచాయితీ చేయల్సివచ్చింది.
నాకు క్రిష్ గారు, రత్నంగారు కథ తీసుకువచ్చినప్పుడు పీరియాడిట్ ఫిలిం ఎలా చేయాలనేది కొంచెం ఆలోచన చేశాను. ఎన్ని ఎఫెక్ట్స్ వున్నా మన ఎమోషన్స్ కరెక్ట్ గా చూపిస్తే కరెక్ట్. మొగల్ రాజుల గురించి పుస్తకాల్లో చిన్నప్పుడు చదివాం. గ్రేట్ అంటూ రాశారు. ఆయన టోపీలు కుట్టుకుని జీవించాడని మాట్లాడారు. సోషల్ స్టడీ పుస్తకాల్లో జిజియా పన్ను గురించి చదివాను. ఎయిర్ పోర్ట్ కు వెళితే ఇమిగ్రేషన్ లాగా అప్పట్లో ఇలాంటి పన్ను పెట్టారు.
ఈ సినిమా నిడివి 4గంటలకుపైగా వుంది. అందుకే రెండు పార్ట్ లు పెట్టాం. ఇంటర్ వెల్ పార్ట్ చౌకీదాన్ దగ్గర ఆగిపోయింది. మనం అక్బర్ గ్రేట్ అని వింటాం. క్రిష్ణ దేవరాయాలు, ఝన్సీ లక్మీ భాయ్ గురించి పెద్దగా వినం. మన చరిత్ర రాసిన వాళ్ళు మన వారిపై చిన్నచూపు చూశారనిపించింది. హిందూవుగా వున్నందుకు పన్ను కట్టండి అనే పాయింట్ ను చాలామంది తీయలేకపోయారు. ఎందుకంటే సమస్యలు వస్తాయోనని భయపడేవారు. ఔరంగ్ జేబు చాలా కాలం చచ్చిపోయాడు. అయినా భయపడతారు. రాజ్యాలను కొల్లగొట్టం గురించి పుస్తకాల్లో వుంది. కానీ జిజియా పన్ను గురించి విస్తరించాలని అనుకున్నా.
నా పొలిటికల్ జర్నీ కూడా 18 నిముషాల క్లయిమాక్స్ లో నన్ను ప్రేరేపించాయి. ఇదే అందరికీ నచ్చి రిపీట్ ఆడియన్స్ వెళుతున్నారని చెబుతున్నారు. నేను పుస్తకాలు చదువుతాను. హీరోగా ఊహించుకోలేదు. కానీ దైవం నన్ను హీరో చేసింది. నేను హిందూ, ముస్లిం ల గురించి మాట్లాడంలేదు. గుడ్ అండ్ బేడ్ గురించి చర్చించాం. ఖాన్ అబ్దుల్ ఖాన్ పాత్రను డిజైన్ చేసుకుని జయసుధ కుమారుడిని తీసుకున్నాం.
పార్ట్ 2 కూడా 30 శాతం షూట్ అయింది. మిగిలిన షూటింగ్ కూడా జరగాలని కోరుకుంటున్నా. మైత్రీమూవీస్ నవీన్ గారి, పీపుల్స్ మీడియా వారు ముందుకువచ్చి రిలీజ్ చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఉపముఖ్యమంత్రి అయినా సినిమా విడుదల అనేసరికి ఆర్థిక లావాదేవీలుంటాయి.
కొంతమంది బాయ్ కాట్ చేస్తామని విన్నాను. దానికి నేను భయపడను. సినిమా ఆపాలంటే ఆపండి. నేను లెక్చ చేయను. నామీద బేన్ చేయడం క్విట్ ఇండియా మూమెంటా? చెప్పండి. తాటాకు చప్పుల్లకు లొంగం. నా అభిమానులకు నేను చెబుతున్నా...మీరిచ్చిన ధైర్యంతోనే ముందుకు సాగుతాను.
నాకు డిప్రెషన్ వుండదు. ధైర్యమే వుంటుంది. కొంతమంది ఔరంగ్ జేబ్ గురించి చెబితే విమర్శిస్తున్నారు. కథను చెప్పా. మనల్ని విమర్శిస్తే మనం ధైర్యంగా వున్నామనే అని రత్నంగారితో అన్నా. జిజియా పన్నుపై చాలామందికి బాధ వుంది. నాలా బాధపడేవారికి ఇది చెప్పాలని సినిమా తీశాను.
సినిమాలో కోహినూర్ వజ్రం గురించేకాదు. హిందూ ఇజం, కట్టుబాట్లు సంప్రదాయాలను గట్టిగా చెప్పాను. ఇది చెప్పడంలో నేను సక్సెస్ అయ్యాను. డబ్బులు వస్తాయి. పోతాయి. మనుషుల అనుబంధం వుండదు. అందుకే రత్నంగారికి సపోర్ట్ గా నిలిచాను.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ, 2021 లో హరిహరవీరమల్లు టీజర్ వచ్చింది. 2025లో సినిమా విడుదలైంది. పవర్ స్టార్ పవర్ ఏమిటో ఈ సినిమా నిరూపించింది. ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా వుందని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.