పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. ఈ చిత్రం విడుదలకు ముందే బెన్ఫిట్ షోలు, ప్రీమియర్ షోలు తిలకించి తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కూడా ఇన్‌స్టా వేదికగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "హరిహర వీరమల్లు" మూవీ ప్రీమియర్ షో చూశాను. సినిమా చాలా బాగుంది. పవన్ ఎంట్రీ సీన్ హైలెట్. మూవీలో ఇలాటి ఎలివేషన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్, దానికి కీరవాణి ఇచ్చిన బీజీఎం థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్ళి థియేటర్లలో వీరమల్లు పోరాటాన్ని చూడండి.