అల్పాహారం మితంగా తీసుకుని.. ఆహార డైరీ పాటించండి

బుధవారం, 7 డిశెంబరు 2011 (17:35 IST)
FILE
అల్పాహారం మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార మిళితమైన అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆకలి భావన అదుపులో ఉంటుంది. శరీరంలో అధిక కెలోరీలు చేరకుండా ఉండాలంటే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. ఆకలితో పాటు రక్తంలో చక్కెరస్థాయులు కూడా సమతూకంలో ఉంటాయి.

ప్రతిరోజూ ఆహారాన్ని ఏయే సందర్భాల్లో ఎంత మోతాదులో తీసుకుంటున్నామో ఓ డైరీలో రాసుకోవాలి. దానివల్ల సమస్య ఎక్కడుందో గుర్తించడం సాధ్యమవుతుంది.

అలాగే ఆకలిగా అనిపించి నియంత్రణ లేకుండా తింటుంటే పొట్టనిండిన భావనను కలిగించే పదార్థాలను ఎంచుకోవాలి. పీచు, మాంసకృత్తులు, నీటిశాతం ఎక్కువగా ఉండేవి తీసుకోవచ్చు. కూరగాయలతో చేసే సలాడ్లు, పండ్లు, పండ్లరసాలు, పుచ్చకాయ, జామ వంటివి శరీరానికి తగిన పోషకాలను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి