ఈ సందర్భంగా దర్శకుడు నింబావత్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు ఆగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. 80 శాతం చిత్రాన్ని ఇండోర్‌లో 20 శాతం సీన్లు మేఘాలయలో తెరకెక్కిస్తాం అని తెలిపారు.
అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎస్పీ నింబావత్ గతంలో పలు హిందీ సినిమాలకు ప్రొడ్యూసర్, రచయితగా వ్యవహరించారు. 2018లో కబడ్డీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలాఉండగా.. ఈ హనీమూన్ హత్య కేసుపై బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ సినిమాను తీయనున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. ఆయన వాటిని ఖండించారు.