కొత్తిమీర డెకరేషన్‌కే కాదండీ... ఫలితాలు బోలెడున్నాయ్

శనివారం, 26 ఫిబ్రవరి 2011 (18:41 IST)
WD
ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరపీ(రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి