బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకుంటే!?

FILE
బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, పచ్చికూరగాయలు ఆహారం తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి ఆకలిని మితంగా వుండటానికి జ్ఞాపకశక్తికి, చక్కని శరీరాకృతికి, మంచి ఛాయరావడానికి తోడ్పడతాయి.

అలాగే బరువు తగ్గాలనుకునే వారు భోజనంలో అన్నం, ఆకుకూరలు, పప్పు, మజ్జిగ తీసుకోవాలి. భోజనానికి ముందు ఓ గ్లాసు నీరు తాగాలి. అన్నం తీసుకున్న తర్వాత మజ్జిగ తాగి ఒక టమోటా లేదా ఓ దోసకాయపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినాలి.

సాయంత్రం టిఫిన్‌గా అటుకులు లేదా పేలాల్లో ఉల్లిగడ్డ ముక్కలు కలుపుకుని తింటే బరువు ప్రభావం అంతగా ఉండదు. రాత్రి భోజనంలో రెండు నూనె లేని చపాతీలు, ఒక గ్లాసు మజ్జిగ, ఒక టమోటా తిని, కడుపునిండా నీరు తాగండి. వారానికి ఒకసారి మాంసాహారం తీసుకోండి. స్కిప్పింగ్ లేదా సైక్లింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి