అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీపైకి డంపర్, మృతి

మంగళవారం, 19 జులై 2022 (18:41 IST)
హరియాణాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారిని డంపర్‌తో తొక్కి చంపించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. మీడియా కథనాల ప్రకారం... ‘మేవాత్ జిల్లాలోని తావడు డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్, నుహ్‌లోని అక్రమ మైనింగ్ కేసును విచారించడానికి వెళ్లారు.

 
ఇద్దరు పోలీసులతో ఆయన మంగళవారం 11.50 ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఒక డంపర్‌ను ఆపారు. పేపర్లు అడగ్గా డ్రైవర్ వేగం పెంచి డంపర్‌ను పోలీసుల కారు మీదకు ఎక్కించాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్, గన్‌మెన్ తప్పించుకోగా డీఎస్పీ సురేంద్ర మాత్రం చనిపోయారు.’ 1994లో అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా చేరిన సురేంద్ర ఆ తరువాత డీఎస్పీ స్థాయికి ఎదిగారు. మరొక నాలుగు నెలల్లో ఆయన రిటైర్ కానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు