నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రిటైరయ్యేదాకా ఏపీలో ఎన్నికలుండవు: జేసీ - Press Review

శుక్రవారం, 20 నవంబరు 2020 (14:18 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రిటైరయ్యేంతవరకూ పంచాయతీలే కాదు... స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరగబోవని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. జేసీ గురువారం అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబును కలిసిన అనంతరం మీడియాతో ముచ్చటించారు.
 
''ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలుంటాయని కమిషనర్‌ ప్రకటించినా, ప్రొసీజర్‌ ఇతరత్రా పనులు ఉంటాయి. ఈలోపు ఎవరో ఒకరు కోర్టుకు పోతారు'' అని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు ఏకగ్రీవం అయినవాళ్లైనా ఈ పని చేయొచ్చునని, ఏకగ్రీవం కానివాళ్లు మళ్లీ ఎన్నికలను తాజాగా నిర్వహించాలని కోర్టును కోరవచ్చని అభిప్రాయపడ్డారు.
 
''ముఖ్యమంత్రి, మంత్రులు ఇందుకు సమ్మతించరు. అప్పట్లో ఎన్నికల కమిషనే ఎన్నికల ప్రక్రియ నిర్వహించినందున ఏకగ్రీవమయ్యారు కాబట్టి కొనసాగించాలని చెబుతారు. ఇలా ఇద్దరూ కోర్టుకు పోతారు'' అని విశ్లేషించారు జేసీ. ''కోర్టుకు పోయినోడు కాటికిపోయినట్లే కదా! కోర్టులో 15 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు