పవన్ కల్యాణ్: ‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’

మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:13 IST)
‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్‌ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'జనసేనను టీడీపీ బీ టీమ్ అంటే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీమ్' అంటామని పేర్కొన్నారు.

 
అప్పుడు మీరు బాదుడే బాదుడు అన్నారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఏమనాలి? అని ఆయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్.. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.

 

ఇంకొక్కసారి నన్ను వాళ్ళకి, వీళ్ళకి దత్తపుత్రుడు అని అంటే మాత్రం
జగన్ రెడ్డి గారిని సిబిఐకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. - JanaSena Chief Sri @PawanKalyan #JanaSenaRythuBharosaYatra pic.twitter.com/a50wOWTpca

— JanaSena Party (@JanaSenaParty) April 12, 2022
రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నామని తెలిసి, ప్రభుత్వం హుటాహుటిన వారికి నష్టపరిహారం చెల్లిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు