Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

సెల్వి

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (14:06 IST)
Mushrooms
చిన్నాపెద్దా లేకుండా మష్రూమ్స్ ఇష్టపడి తింటారు. అయితే వీటిని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిని కడిగేటప్పుడు మట్టి వాసన వస్తే ఆ పుట్టగొడుగులను క్లీన్ చేసేటప్పుడు ఈ పద్దతులను పాటించాలి. అవేంటంటే.. వేడినీటిని పోసి మష్రూమ్స్‌ను శుభ్రం చేయవచ్చు. 
 
అయితే చాలా సేపు ఉడికేంత వరకు వుంచకూడదు. వేడిగా వుండే నీటిలో వేసి మష్రూమ్స్ వేయడం ద్వారా అందులో మట్టి తొలగిపోతుంది. పురుగులుంటే అవి చనిపోతాయి. అలాగే పసుపులో మష్రూమ్స్ నానబెట్టి ఆ తర్వాత వండుకోవచ్చు. ఉప్పును కలుపుకోవచ్చు. 
 
పసుపు, ఉప్పులో మష్రూమ్స్‌ను ఐదు లేదా పది నిమిషాలు వుంచిన తర్వాత మళ్లీ వాటిని వేరే శుభ్రమైన నీటిలో కడిగి వంటలోకి వాడుకోవచ్చు. ఇలా శుభ్రపరిచి తీసుకునే మష్రూమ్స్ తీసుకోవడం ద్వారా కడుపునొప్పి వంటి ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు