ఢిల్లీ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే రాజస్థాన్ రాష్ట్రంలోని అరవాలీ కొండ ప్రాంతం వస్తుంది. దాదాపు 800 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు కొదవలేదు. రక రకాల అటవీ జంతువులు ఇక్కడ ఉన్నాయి. భారత దేశంలో పేరు పోయిన వన్య మృగాల ప్రాంతాలలో ఇది ఒకటి.
నిజంగా చూడ దగిన ప్రాంతం ఇక్కడున్న పులులు, జంతువృక్షజాలం అహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ పులులు, చిరుతులు, జింకలు, మొసళ్లు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఉండే జంతువులు చాలా ఫ్రీగా ఉంటాయి. వాటి విన్యాసాలను నేరుగా తిలకించే అవకాశం మనకు ఉంది. నీటి కొలనల్లో జంతువుల ప్రవర్తనన అత్యద్భుతంగా ఉంటుంది. ఈ అభయక్షేత్రంలోని సిలిసెర్హ్ సరస్సు చాలా అరుదు.
జంతువుల ప్రవర్తన ఒక్కటే కాదు. మోటారు డ్రైవింగ్ ఇక్కడి ప్రత్యేకతలు ఇది ఉదయం, సాయంత్రం ఉంటుంది. ఇక్కడే పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. కాంక్వాడీ కోట కూడా చాలా ఆకర్షణగా ఉంటుంది. అలాగే ఇక్కడే కొన్ని గిరిజన తెగలు, వారి జీవన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
1958లో ఈ ప్రాంతాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం వన్య మృగ ప్రాంతంగా ప్రకటించింది. 1979లో ఈ ప్రాంతానికి టైగర్ ప్రాజెక్టుగా నిర్ణయించారు. ఆ తరువాత దీనిని జాతీయ స్థాయి పార్క్‌గా ప్రకటించారు. ఈ వన్యసంరక్షణా విభాగంలో చాలా జంతువులు అభివృద్ధి సాధించాయి.
అరవాలి అటవీ ప్రాంతంలోని సన్నని లోయలు, కొండలు చాలా సుందరంగా ఉంటాయి. పచ్చని గడ్డి, రాళ్ళు జంతువుల జీవనానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడి వాతావరణం చాలా అరుదైన మొక్కలు కూడా ఇక్కడ అగుపిస్తాయి. వర్షాకాలంలో, వేసవి కాలంలో కూడా ఇక్కడి వాతావరణం చాలా పచ్చగా కనిపిస్తుంది.
సరిస్కా జాతీయ పార్కు టైగర్స్ పార్కుగా గుర్తింపు పొందింది. దాదాపుగా ఇక్కడ 35 పులులు ఉన్నాయి. నక్కలు, హైనా, తోడేలు, అడవి పిల్లులు ఇలా చాలా జంతువులే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల పక్షులున్నాయి. వాటిలో ప్రధానమైన కోయిల, నెమళ్ళు, అడవి కోళ్ళు ఇలా రక రకాల పక్షులు ఉన్నాయి.