హాయిగోలిపే హార్సీలీ హిల్స్

ఎత్తయిన కొండలు.... అక్కడికి అడుగుపెట్టగానే ఒక విచిత్ర అనుభూతి... చల్లని వాతావరణం... చుట్టూ పచ్చని చెట్లు. పక్షుల కిలకిల రావాలు. ఆ అనుభూతే... అనుభూతి. ఆంధ్రప్రదేశ్‌లోని చెప్పుకోదగిన ప్రదేశాలలో హార్సీలీ హిల్స్ ఒకటి. తిరుపతి దాదాపు 144 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా చెప్పవచ్చు. ప్రకృతి సౌందర్యాలకు పెట్టింది.. పేరు.

ఆ పేరు ఎలా వచ్చింది
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని ఈ ప్రాంతం ఒకప్పుడు కడప జిల్లాలో ఉండేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీష్ హయాంలో కలెక్టర్‌గా ఉన్న డబ్ల్యూ.డి. హార్సిలీ ఎక్కువగా ఇక్కడ వచ్చేవాడు. ఆయన విశ్రాంతి నిలయంగా ఉన్న ఈ ప్రాంతం కొన్నాళ్ళ తరువాత మెల్లగా అయనకు వేసవి నివాసంగా మారిపోయింది. అన్ని అధికారక కార్యక్రమాలు అక్కడ నుంచే సాగేవి. దీంతో దీనిని హార్సిలీ హిల్స్‌గా పేరు ముద్ర పడిపోయింది. చుట్టూ దట్టమైన చెట్లు, క్రూర జంతువులు, అక్కడక్కడ పచ్చిక బైళ్ళు జనాన్ని చాలా అక్కట్టుకుంటుంది. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచు జాతికి చెందిన వారు ఆ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు.

ఉన్న ప్రదేశ
సముద్రమట్టానతకి దాదాపుగా 1265 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలో ఉంది.

వసతులు ఎలా ఉంటాయి
అక్కడ ఉండడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వసతి సమూహాలున్నాయి. అలాగే చిత్తూరు సహరకార సంఘం అతిథిగృహం కూడా ఉంది. ఇవన్నీ కాక ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి.

చూడదగినవేమిటి
ఇక్కడి సహజ ప్రకృతి సౌందర్యమే పెద్దగా చూడదగిన ప్రదేశం. ప్రకృతి అందాలకు ఇది నెలవు. సంపెగలు విస్తరించి ఉంటాయి. అలా ఇక్కడున్న రిషీవ్యాలీ స్కూల్ కూడా చాలా చూడదగిన ప్రాంతమే. ఇక్కడున్న జంతువులు కూడా జనాన్ని బాగానే ఉంది. మల్లమ్మ దేవాలయం కూడా సందర్శించవచ్చు. కౌండిన్యకు వెళ్ళడం ఒక విధంగా సాహసయాత్ర అవుతుంది.

మార్గాల
రోడ్డు మార్గానైతే మదనపల్లె నుంచి దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది. అలాగే అద్దె వాహనాలలో కూడా వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి బస్సు సౌకర్యం ఉంది. విమానాల ద్వారా వచ్చే పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గాన హార్సిలీ హిల్స్ చేరుకోవలసి ఉంటుంది. రైలు మార్గాన చేరుకోవాలనుకునే వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది. తరచుగా ఉండే సర్వీసులు కాస్త తక్కువగా ఉంటాయి. మదనపల్లెకు 13 కి.మీ. దూరంలోని స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి