కేరళలోని అందమైన జలపాతాలు, అక్కడ కదలాడే జంతుజాలాలతో కేరళ అటవీ అందాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ అటవీ అందాలు కేరళకు పెద్ద ఆస్తి. ప్రకృతి అందాలకు నెలవైన కేరళను ప్రతి ఒక్కరు దర్శించి తీరాల్సిందే.
అదే విధంగా కేరళలోని మున్నార్, ఇడుక్కి టీ తోటలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కేరళ అటవీ ప్రాంత సందర్శన కచ్చితంగా గుర్తుండిపోతుంది. ఎన్నో అనుభూతులను మిగుల్చుతుంది. వీటిని దర్శించేందుకు ఎన్నో ప్యాకేజీలు నేడు అందుబాటులో ఉన్నాయి.
కేరళ రాష్ట్రం ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు... ఇక్కడ వచ్చి మరీ చికిత్స తీసుకుంటుంటారు. దీనికి గాను అక్కడ కైరళి లాంటి ఎన్నో ప్యాకేజీలు ఉన్నాయి.