వనకన్యలు రారమ్మని కవ్వించే అందాల "మున్నార్"

FILE
ఆకుపచ్చ సౌందర్యాన్ని ఒళ్లంతా పులుముకున్న ప్రకృతి, అందమైన జలపాతాలు, అక్కడ కదలాడే జంతుజాలాలతో కేరళ అడవులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారతదేశ ఉద్యానవనంగా పేరుగాంచిన కేరళ రాష్ట్రానికి అక్కడి అడవులను ప్రకృతి ఇచ్చిన అతిపెద్ద సంపదగా వర్ణించవచ్చు.

సంస్కృతి, సంప్రదాయాలకు.. ప్రాకృతిక అందాలకు నిలయమైన కేరళలో... తిరువనంతపురం, క్యాలికట్, కొచ్చిన్, కేసర్‌గడ్, లక్కిడి లాంటి అందమైన ప్రాంతాలతో పాటు లెక్కలేనన్ని పర్యాటక స్థలాలు ఉన్నాయి. కొండ ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడేవారు "ఇడుక్కి" జిల్లాను తప్పనిసరిగా చూడాల్సిందే. అందులోనూ "మున్నార్" ప్రాంతం తన సౌందర్యంతో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది.

మున్నార్ తూర్పు, పడమర దిక్కుల్లో ఎత్తైన కనుమలు కొలువుదీరినట్లుగా ఉంటాయి. పడమటి దిక్కులో ఉండే అరేబియా సముద్రం, పచ్చని గోధుమ పంట పొలాలు, అడవులు, నల్లగా ఉండే నీరు పర్యాటకులకు స్వర్గాన్ని తలపించేదిగా ఉంటుంది. కేరళ పర్యాటక స్థలాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మున్నార్ ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా సరే దాసోహమవ్వాల్సిందే. ఇక కొండలతో నిండి ఉన్న "ఇడుక్కి" అయితే ఎల్లప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది.
మూడునదులు కలిగిన "మున్నార్"
తమిళ భాషలో మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ఈ పట్టణం మూడు నదులను కలిగి ఉంటుంది కాబట్టే, దానికి ఆ పేరు వచ్చింది. మున్నార్ "టీ" తోటలకు ప్రసిద్ధి చెందినది. టాటా టీ కంపెనీవారి ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంటుంది. మున్నార్‌కు 13 కిలోమీటర్ల దూరంలో...


ఇడుక్కి జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది "ఇడుక్కి ఆర్చ్ డ్యామ్". ధనూకారము (ఆర్చ్) కలిగిన డ్యాంలలో ఇది ప్రపంచంలోనే రెండో స్థానాన్ని, ఆసియాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. కురవన్, కురతి కొండలమీదుగా... 550 అడుగుల ఎత్తు, 650 అడుగుల వెడల్పుతో కట్టబడిన ఈ డ్యామ్ వీక్షకులకు కనువిందు చేస్తుంటుంది. దీనికి దగ్గర్లో గల వన్యమృగాల కేంద్రంలోని ఏనుగు, అడవి నక్క, అడవి పిల్లి, ఎలుగుబంటి లాంటి జంతువులు, కోబ్రాలతో పాటు ఎన్నోరకాల విషంలేని పాములు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

మనసును దోచే అందమైన కొండ ప్రాంతమైన "మున్నార్" ఇదే ఇడుక్కి జిల్లాలోనే ఉంటుంది. సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో చెక్కలతో నిర్మించిన భవనం, డైనింగ్ రూమ్, హైరేంజి క్లబ్ నెలకొని ఉన్నాయి. ఇక్కడ ప్రవాహాలు, సరస్సులు, పిక్నిక్ స్పాట్లు, మలుపులు తిరిగిన రోడ్లు.. దక్షిణ భారతంలోనే అతి ఎత్తైన శిఖరాలు, వైల్డ్‌లైఫ్ రిజర్వ్‌లు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

తమిళ భాషలో మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ఈ పట్టణం మూడు నదులను కలిగి ఉంటుంది కాబట్టే, దానికి ఆ పేరు వచ్చింది. మున్నార్ "టీ" తోటలకు ప్రసిద్ధి చెందినది. టాటా టీ కంపెనీవారి ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంటుంది. మున్నార్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ముట్టుపట్టి అనే ప్రశాంతమైన చిన్న ప్రదేశం ఉంటుంది. దీన్నే ఓల్డ్ మున్నార్ అని కూడా అంటుంటారు. ముట్టుపట్టి సరస్సు డ్యామ్ ఇక్కడే ఉంది. దీనికి దగ్గర్లోని కుండల సరస్సు కూడా పర్యాటక ప్రదేశమే....!

ఆగస్టు నుంచి మార్చి నెల వరకూ పై ప్రాంతాలలో పర్యటించేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక వసతి విషయాలకు వస్తే... కేరళ పర్యాటక వికాస నిగమ్ వారి "హిల్ రిసార్ట్ టీ కౌంటీ" పర్యాటకులు విడిది చేసేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. 43 గదులుండే ఈ రిసార్ట్‌లో హెల్త్‌క్లబ్, కాన్పరెన్స్ హాల్, మసాజ్ పార్లర్, రెస్టారెంట్, డ్యాన్స్‌క్లబ్ లాంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఇండోర్ గేమ్స్, ట్రెక్కింగ్ లాంటి సదుపాయాలు కూడా ఉంటాయి. 2నుంచి 8వేల రూపాయలవరకూ అద్దె గదులు ఇక్కడ లభిస్తాయి.

వెబ్దునియా పై చదవండి