అందంగా కనిపించాలంటే.. పండ్ల ఫేషియల్స్ ట్రై చేయండి. ఫేస్ ప్యాక్‌లకి, ఫేషియల్‌కు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో అరటిపండుతో ఫేషియల్ చేసుకుంటే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని అరటిపండు గుజ్జుని ముఖాని పట్టించి 15 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. జిడ్డు చర్మం, ముఖం మీద నల్లటి మచ్చలు వున్నవారైతే.. రెండు నుంచి మూడు నిమిషాలపాటు ఫేషియల్ స్టీమ్ తీసుకోవాలి. ఫేషియల్ స్టీమ్ వలన చర్మం మృదువుగా మారు తుంది.
ఆపై అరటి తొక్కతో ముఖంపై తేలికగా రబ్ చేయాలి. తద్వారా చర్మంపై గల మృతకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత అరటి - కోకో బటర్‌లతో కూడిన మసాజ్ క్రీమ్‌తో పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తద్వారా పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది. చివరగా బనానా పాక్‌ను ముఖానికి, మెడకి పట్టించి 15 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. ఆ తర్వాత వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని మెత్తటి టవల్‌తో తుడుచు కుంటే ముఖం అందంగా కనబడుతుంది. ఈ ఫేషియల్ మాసానికి ఓసారి లేదా రెండుసార్లు చేసుకోవడం ద్వారా ముఖ ఛాయ పెంపొందుతుందని బ్యూటీషన్లు చెప్తున్నారు.