ఫ్రిజ్‌లో ఉంచిన రోజ్‌వాటర్, కీరదోసకాయ రసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్రతి రోజు రాత్రి పట్టించుకుంటే ముఖంపై జిడ్డు తొలగిపోతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడానికి కాటన్ ట్యాబ్ వాడాలి. లేకుంటే చిన్నపాటి కాటన్ క్లాత్ అయినా పర్లేదు.
అలాగే చర్మం నిగనిగలాడాలంటే.. ఒక కప్పు పెరుగులో బియ్యం పిండి, తగినన్ని బాదం పలుకులు వేసి ఓ పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాత్రి నిద్రపోయేముందు రాసుకుని.. పొద్దున్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.
అలాగే ఓట్స్ తినడానికే కాదు, ముఖ వర్ఛస్సు పెంచుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఓట్స్, తేనె, కోడి గుడ్డు సొన, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి, నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మఛాయను మెరుగుపడుతుంది.
చర్మంపై ఏర్పడే నల్లవలయాలు, మచ్చలు పోవాలంటే.. అరకప్పు పసుపు పొడి, నాలుగో వంతు రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలని బ్యూటీషియన్లు చెప్తున్నారు.