కలబంద గుజ్జులో పెరుగు కలిపి.. ఇలా చేస్తే..?

బుధవారం, 23 జనవరి 2019 (11:26 IST)
నేటి తరుణంలో చాలామంది మొటిమ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ మొటిమలు తొలగించుకోవడానికి బయట దొరికే ఏవేవో క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతున్నారు. అయినను ఎలాంటి కనిపించలేదు. ఈ బయట క్రీమ్స్ వాడేతేనన్నా.. మొటిమలు తగ్గుతాయనుకుంటే.. ఇంకా ఎక్కువైపోయాయి దేవుడా అంటూ మొరపెడుతుంటారు. మొటిమలు తొలగించి.. సొగసైన చర్మాన్ని పొందడం ఎలాగనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
 
1. 2 స్పూన్ల్ కాఫీ పొడిని ఒక బౌల్‌లో వేసుకుని ఆపై అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. తరచు ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. 
 
2. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, పెరుగు లేదా మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆపై గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. 
 
3. ముల్తానీ మట్టిలో 2 స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేసి చూడండి.. తప్పక ఫలితం ఉంటుంది.
 
4. టమోటో ప్రతీ ఇంట్లో తప్పక ఉంటుంది. కాబట్టి ఒక చిన్న టమోటాను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే మొటిములు పోతాయి. దాంతో ముఖం మృదువుగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు