పుదీనా పచ్చడి చేస్తున్నారా..?

గురువారం, 10 జనవరి 2019 (11:21 IST)
పుదీనా పచ్చడి చేస్తున్నారా.. కాస్త వేరుశెనగలను కలిపి చూడండి.. రుచి అదిరిపోతుంది. ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. పప్పును ఉడికించేటప్పుడు వంట నూనెను కాసింత చేర్చి, వెల్లుల్లిని చేర్చి ఉడికిస్తే పోషకాలు అలానే వుంటాయి. క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వెయ్యాలి. 
 
బ్రెడ్ ప్యాకెట్‌లో బంగాళాదుంప ముక్కలు వుంచితే త్వరగా పాడవవు. వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి. గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి. కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు