పెరుగులో ఉప్పును కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (12:05 IST)
తలలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన జుట్టు ఎక్కువగా రాలుతుంది. అంతేకాకుండా దుమ్ము పేరుకుపోయి పలు రకాల చర్మవ్యాధులు, చుండ్రు సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
గుడ్డు సొనలో కొద్దిగా పెరుగు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. తలకు గోరువెచ్చని నూనెను మర్దన చేసుకుని అరగంట తరువాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. అప్పుడే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
పెరుగులో కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. దాంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు పోషకాహారం కూడా చాలా ముఖ్యమే. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్స్, ఇనుము, ప్రోటీన్స్ ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు, గింజ ధాన్యాలు, మాంసాహారం, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు