బంగాళాదుంప మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. కమలాపండు రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
కీరదోస మిశ్రమంలో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే ముఖంపై గల వెంట్రుకలు తొలగిపోతాయి.