రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి కళ్ళు అలసటగా ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. గ్రీన్ టీ బ్యాగులను కంటిపై 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన కంటి అలసట తగ్గుతుంది. అలానే కంటి అలర్జీలు, వాపు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
కీరదోసను చిక్కచిక్క ముక్కలుగా కట్‌చేసుకుని వాటిని కంటిపై ఉంచుకుంటే కూడా కంటి అలసట తగ్గుతుంది. అలాకాకుంటే కీరదోస రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని అందులో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి.
ముందుగా కళ్లను గుండ్రంగా తిప్పాలి. ఆ తరువాత కుడి, ఎడమవైపులా తిప్పాలి ఇలా ప్రతిరోజూ సమయం దొరికిన్నప్పుడంతా చేస్తే కంటి అలసటం తగ్గుతుంది. అలాకాకుంటే పాలలో కొద్దిగా తేనెను కలుపుకుని కంటి చుట్టూ నెమ్మదిగా దూదితో మర్దన చేసుకోవాలి. ఇది బాగా ఆరిన తరువాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కంటికి మంచి ఉపశమనం లభిస్తుంది.