చాలామంది అందంగా ఉండటం కోసం బయటదొరికే పదార్థాలు, క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వీటి వాడకం కంటే ఇంట్లో సహజసిద్ధమైన పదార్థాలతో కాంతివంతమైన, తాజాదనంగా ఉండే అందాన్ని పొందవచ్చని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..
1. మిరియాల పొడి, నిమ్మరసం కలిపి రాత్రిపూట తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. కోడిగుడ్డు సొనలో అరటిపండు బాగా కలిపి తలకు రుద్దుకుని శుభ్రం గా స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
2. వారానికి ఒక్కసారి గ్లిసరిన్, నిమ్మరసం కలిపిన ప్యాక్ వేసుకుంటే ముఖంపై మొటిమలు తగ్గుతాయి. నిమ్మరసం, స్పూన్ వెనిగర్ కలిపి జుట్టుకు రాసి, 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే జుట్టు పెరుగుతుంది.